విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా గురించి కీలక విషయాలను వెల్లడించారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమా చిత్ర పరిశ్రమపై సెటైరికల్‌గా తెరకెక్కుతోందని ఇందులో విశ్వక్ దర్శకుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలిపాడు. జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి కామెడీ సినిమాలను తెరకెక్కించిన కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో తమిళ నటి కాయడు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఆమె డేట్స్ దొరకడం లేదని నాగవంశీ తెలిపాడు. ఫంకీలో ఇప్పటివరకు ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని నాగవంశీ అన్నారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌కు, అలాగే దర్శకుడు కెవీ అనుదీప్‌కు చాలా ముఖ్యమైన సినిమా కాబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

- July 15, 2025
0
74
Less than a minute
Tags:
You can share this post!
editor