దిల్జిత్ దోసాంజ్‌, కంగ‌నా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం

దిల్జిత్ దోసాంజ్‌, కంగ‌నా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం

పంజాబీ స్టార్ సింగ‌ర్ దిల్జిత్ దోసాంజ్ న‌టించిన‌ ‘సర్దార్ జీ 3’ సినిమాపై వివాదం అలుముకున్న విష‌యం తెలిసిందే. పాకిస్థానీ నటి హానియా అమీర్‌తో దిల్జిత్ దోసాంజ్ ఈ సినిమాలో నటించడంతో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు ప్రముఖులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయితే ఈ వివాదం బాలీవుడ్ నటి కంగనా రనౌత్, పంజాబీ స్టార్ దిల్జిత్ దోసాంజ్‌ల‌ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ వివాదంపై స్పందించిన కంగనా రనౌత్ దిల్జిత్ దోసాంజ్‌ని ఉద్దేశిస్తూ.. కొంతమందికి వారి సొంత ఎజెండా ఉంటుంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. మనం దేశ నిర్మాణ స్ఫూర్తిని కలిగి ఉండాలి. దిల్జిత్ ఎందుకు తన సొంత మార్గంలో వెళ్తున్నాడు? అని కంగనా వ్యాఖ్యానించింది. ఒక సైనికుడికి కూడా దేశభక్తికి సంబంధించిన సొంత ఎజెండా ఉంటుందంటూ కంగ‌నా చెప్పుకొచ్చింది. మనం అందరినీ క‌లుపుకొని పోడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఏ సమస్యలు తలెత్తవు అని కంగనా చెప్పుకొచ్చింది.

editor

Related Articles