‘బాహుబలి–ది ఎపిక్’కి ఏకంగా 5 గంటల 20 నిమిషాలట..

‘బాహుబలి–ది ఎపిక్’కి ఏకంగా 5 గంటల 20 నిమిషాలట..

కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా దగ్గర స్టార్ట్ అయ్యిన రీరిలీజ్‌ల ట్రెండ్ ఎలా కొనసాగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమాలలో లేటెస్ట్‌గా అనౌన్స్ అయ్యిన భారీ సినిమాయే “బాహుబలి”. తెలుగు సినిమా నుండి మొత్తం ఇండియన్ సినిమాకే గేమ్ ఛేంజర్‌గా నిలిచిన ఈ సినిమా ఈ ఏడాదితో పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మేకర్స్ మళ్ళీ ఆడియెన్స్‌కి భారీ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాజమౌళి, ప్రభాస్‌ల ఈ ఎపిక్ సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతుండగా పార్ట్ 1, పార్ట్ 2 లని మేకర్స్ కలిపి చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా బాహుబలి రెండు భాగాలూ కలిపి ‘బాహుబలి – ది ఎపిక్’ గా తీసుకొస్తుండగా ఈ సింగిల్ పార్ట్ సినిమాకి షాకింగ్ రన్ టైం లాక్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి ఏకంగా 5 గంటల 20 నిమిషాలకి పైగా రన్ టైంని లాక్ చేశారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి.

editor

Related Articles