డార్లింగ్ మర్యాదలపై సంజయ్ దత్…

డార్లింగ్ మర్యాదలపై సంజయ్ దత్…

పాన్ ఇండియా హీరోగా ప్రభాస్  ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా ఒకటి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో మరిన్ని అంచనాలు సెట్ చేసుకోగా ఇప్పుడు అంతిమ దశకి షూటింగ్ చేరుకుంది. అయితే ప్రభాస్ సినిమాలు అంటే అందులో నటిస్తున్న నటీనటులు ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తారు. అదే ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం కోసం. ముఖ్యంగా ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అని అందరికీ తెలిసిందే. తన ప్రేమ అంతా కడుపు నిండా తిండి పెట్టడంలోనే చూపిస్తాడేమో అనే రేంజ్‌లో తన హీరోయిన్స్, దర్శకులు, నటులకు చూపిస్తాడు. మరి తాజాగా ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కూడా చేరారు. సంజయ్‌దత్ ది రాజా సాబ్‌లో నటిస్తుండగా డార్లింగ్ ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యంలో రకరకాల పిండివంటలు తింటూనే ఉన్నాను అది ప్రభాస్ వల్లే సాధ్యమైంది  అంటూ రీసెంట్‌గా మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పుకొచ్చారు. దీనితో మరోసారి డార్లింగ్ ఇచ్చే ఆతిథ్యం టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

editor

Related Articles