‘రామాయణ’ కోసం అమితాబ్‌ది ఏ పాత్రో..?

‘రామాయణ’ కోసం అమితాబ్‌ది ఏ పాత్రో..?

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ హాలీవుడ్ లెవెల్ చిత్రమే “రామాయణ” ఎన్నో అంచనాల మధ్య సెట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్‌గా టైటిల్ గ్లింప్స్‌తో వాటిని మరింత ఎక్కువ చేసుకుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యష్, సన్నీ డియోల్ లాంటి బిగ్‌స్టార్స్ ఐకానిక్ పాత్రలు చేస్తున్నారు. మరి ఈ సినిమా కోసం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది. అయితే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో తెరవెనుక పనిచేస్తారట. కేవలం తన వాయిస్ ఓవర్ మాత్రం వినిపిస్తారు  అని తెలుస్తోంది. తాను జటాయుకి తన గొంతు అందిస్తారని వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles