96, మెయ్యాళగన్ సినిమాలతో సూపర్‌హిట్‌లు అందుకున్నాడు తమిళ దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ అందుకోవడంతో పాటు క్లాసిక్‌గా నిలిచాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ్ కుమార్ 96 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 96 సినిమాను మొదట హిందీలో తీయాలనుకున్నాను. అభిషేక్ బచ్చన్‌తో ఈ సినిమా తీయాలని ప్లాన్ చేశాను. అయితే ఆ టైంలో అభిషేక్ బచ్చన్ కాంటాక్ట్ నెంబరు దొరకకపోవడం వలన తమిళంలో నా ఫ్రెండ్ విజయ్ సేతుపతితో తెరకెక్కించాను. నాకు చిన్ననాటి నుండే హిందీ వచ్చు. మా నాన్నగారు నార్త్ ఇండియాలో పెరిగారు. అందుకే ఆయన ప్రభావం నాపై ఉండేది. దీంతో నేను ఎప్పుడూ హిందీ సినిమాలు చూసేవాడిని. అలా నాకు హిందీ వచ్చు. అయితే 96 సినిమాను లార్జ్ స్కేల్‌లో చేద్దామనుకున్నాను. అందుకే హిందీలో చేయాలని డిసైడ్ అయ్యానని ప్రేమ్ కుమార్ చెప్పారు.
- July 10, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor

