త‌న సినిమా ప్రివ్యూ చూస్తూ ద‌ర్శ‌కుడు మృతి

త‌న సినిమా ప్రివ్యూ చూస్తూ ద‌ర్శ‌కుడు మృతి

తెలంగాణ ప్రజల జీవనశైలికి అద్దంపట్టే జానపద కళల్లో ఒగ్గు కథకీ విశిష్ట‌ స్థానం ఉంది. “ఒగ్గు” అంటే శివుడి చేతిలో ఉండే డమరుకం. ఇలాంటి గొప్ప సంస్కృతికి అద్దం పట్టేలా రూపొందిన సినిమా బ్రహ్మాండ. ఈ సినిమాను దాసరి సురేష్‌ నిర్మించగా, ఎస్. రాంబాబు తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇలాంటి గొప్ప సంస్కృతికి అద్దం పట్టేలా రూపొందిన సినిమా బ్రహ్మాండ. ఈ సినిమాను దాసరి సురేష్ నిర్మించగా, ఎస్.రాంబాబు తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త‌ను డైరెక్ట్ చేసిన సినిమా ప్రివ్యూ చూస్తుండగా రాంబాబు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తోటి స్నేహితులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామం అల్లీపూర్లో అంత్యక్రియలు నిర్వహించారు. మొదటి సినిమాతోనే గొప్ప విషయం చెప్పాలన్న ఆ ద‌ర్శ‌కుడు, ఇలా అకాల మరణం పొంద‌డం అందరికీ బాధ కలిగించింది. రాంబాబుని మిత్రులు ప్రేమ‌గా న‌గేష్ అని పిలుస్తుంటారు. రాంబాబు గతంలో సుమారు 150 సినిమాలకు, 60 సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’, ‘అన్వేషణ’ వంటి ప్రముఖ సీరియళ్లకు కూడా ఆయన కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు.

editor

Related Articles