సినిమా ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలౌతాయి. వరుస విజయాలొస్తే గోల్డెన్ లెగ్ అని పొగడ్తలతో ముంచెత్తుతారు. అదే పరాజయాలు ఎదురైతే మాత్రం “ఐరన్ లెగ్” అనేస్తారు. అలాంటి అనుభవాన్ని బాలీవుడ్ నేషనల్ అవార్డ్ విజేత విద్యా బాలన్ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొంది. విద్యా బాలన్ తొలిసారిగా మలయాళ హీరో మోహన్‌లాల్‌తో కలిసి ‘చక్రం’ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. కానీ కొన్నిరోజుల షూటింగ్ తర్వాతే సినిమా అనూహ్యంగా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోడానికి కారణం విద్యా అని ఇండస్ట్రీలో ఓ ప్రచారం మొదలైంది. విద్యా బాలన్ వలన అంతా నష్టమే, ఆమె నెగటివ్ ఎనర్జీ గర్ల్ అనే ముద్ర వేసేసారు. దీనిపై స్పందించిన విద్యా బాలన్ .. చక్రం సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు. మోహన్‌లాల్, దర్శకుడి మధ్య అభిప్రాయ భేదాలే కారణం. కానీ నన్నే కారణమంటూ చెప్పుకొచ్చారు. నేను అప్పటికే సైన్ చేసిన 8–9 సినిమాలు క్యాన్సిల్ ఐపోయాయి. ఆ సమయంలో మాలీవుడ్‌కి విద్యా బాలన్ సరిపోదన్న ప్రచారం కూడా జరిగింది. ఇంత ప్రతికూలతల మధ్య విద్యా బాలన్ బాలీవుడ్ వైపు అడుగుపెట్టింది. ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఆమె, అందరి అంచనాలు తలకిందులు చేసింది.
- July 10, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor

