క్రేజీ సీక్వెల్ ‘ధ‌డ‌క్ 2’ రిలీజ్Soon..

క్రేజీ సీక్వెల్ ‘ధ‌డ‌క్ 2’ రిలీజ్Soon..

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్‌ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కాకముందే సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించగా, మరికొన్ని ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్స్‌ తీస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. 2016లో మరాఠీ నుండి వ‌చ్చి బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా  సైరట్ (Sairat). ఈ సినిమా మరాఠీలోనే దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను బాలీవుడ్‌లో ధడక్  పేరుతో రీమేక్ చేశారు. ఇషాన్ ఖట్టర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా హిందీలో కూడా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను బాలీవుడ్  నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ధ‌డ‌క్ 2 అంటూ రాబోతున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, యానిమ‌ల్ భామ త్రిప్తి డిమ్రి  ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతుండ‌గా.. ధర్మ ప్రొడక్షన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా విడుద‌ల తేదీతో పాటు ట్రైల‌ర్ అప్‌డేట్‌ను షేర్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేయ‌బోతుండ‌గా.. సినిమాను ఆగ‌స్టు 1న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఒకప్పుడు ఒక‌ రాజు, ఒక రాణి ఉండేవారు. వారు వేర్వేరు కులాలకు చెందినవారు, వారి కథ ముగిసింది. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది.

editor

Related Articles