డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్నారు హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ. సితార బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమా కామెడీ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాల అనంతరం మళ్లీ నాగవంశీతో చేతులు కలిపాడు సిద్ధూ. వీరి కలయికలో రాబోతున్న తాజా సినిమా బాదాస్(BADASS). మధ్య వేలు పురుషుడిలా ఉంటే అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బబుల్‌గమ్ సినిమాలతో పేరుతెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ సిగరెట్ పట్టుకుని రాక్ స్టార్ (స్టిల్) లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.
- July 9, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor

