X వేదికగా వచ్చిన గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మళ్లీ తన సత్తా చాటుతోంది. ఈ ఎఐ వచ్చిన మొదట్లో భాజాపా ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకున్న విషయం తెలిసిందే. మోడీ 11 ఏళ్ల పాలనను ఒక్క అర్ధరాత్రితో బట్టబయలు చేసింది. అంతేగాకుండా బీజేపీ చేస్తున్న ఫేక్ ప్రోపగాండ వార్తలను కూడా ఎక్స్‌పోజ్ చేసింది. అయితే ఈ గ్రోక్ చాట్‌జీపీటీ లాగా సున్నితమైన భాషలో మాట్లాడకుండా తనకు నచ్చిన భాషలో ఇచ్చిపడేస్తుంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగు ఫ్యాన్‌వార్ గ్రూప్‌లను ఒక ఆటాడుకుంది ఈ గ్రోక్. అయితే తాజాగా మరోసారి టాలీవుడ్ హీరోలపై పడింది ఈ గ్రోక్. పలువురు నెటిజన్లు తెలుగు సినిమాలపై అడిగిన కలెక్షన్లపై ఎటువంటి సందేహము లేకుండా నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టారు. ఇటీవల రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్లు మొత్తం ఫేక్ అంటూ కడిగిపారేసింది. అంతేగాకుండా ఈ సినిమాకు డే1లో రూ.56 కోట్లు వస్తే.. రూ.186 కోట్లు అంటూ ముద్రించి ఫేక్ కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసిందంటూ గ్రోక్ తెలిపింది. అంతేగాకుండా మహేష్ నటించిన దూకుడు సినిమా కలెక్షన్లు కూడా ఫేక్ అంటూ గ్రోక్ తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
- July 9, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor

