అన‌సూయ‌ని ఆంటీ అంటూ ర్యాగింగ్ చేసిన రోజా..

అన‌సూయ‌ని ఆంటీ అంటూ ర్యాగింగ్ చేసిన రోజా..

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అన‌సూయ‌. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో మళ్లీ బుల్లితెర వైపు ఆస‌క్తి చూపుతోంది. ఈ క్రమంలో ఆమె “కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్” షోతో పాటు, జీ తెలుగులో ప్రసారం అవుతున్న “డ్రామా జూనియర్స్ సీజన్ 8” లో జడ్జ్‌గా కనిపిస్తోంది. ఈ షోలో రోజా, అనిల్ రావిపూడి సహ జడ్జ్‌లుగా ఉన్నారు. యాంకర్‌గా సుడిగాలి సుధీర్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఈ షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో అనసూయ, రోజాల మధ్య జరిగిన సరదా సంభాష‌ణ‌ అందర్నీ ఆకట్టుకుంది. ఒక స్కిట్‌లో భాగంగా రోజా అనసూయను “అత్తా” అంటూ పిలవడంతో సెట్‌లో అందరూ షాక్ అయ్యారు. “నువ్వు రంగమ్మత్తగా నటించావు కదా… అత్తలా కనిపిస్తున్నావ్ అందుకే ఆ పాత్ర వచ్చిందేమో!” అంటూ రోజా సరదాగా పంచ్ వేసింది. అదే నన్ను చూసి ఉంటే శ్రీవల్లి క్యారెక్టర్‌ ఇచ్చేవారని రోజా అన‌డంతో, అల్లు అర్జున్‌కి పీలింగ్స్ వచ్చి ఉండేవో లేదో తెలియదు గానీ ఆడియెన్స్‌కి మాత్రం పీలింగ్స్ చచ్చేవి అంటూ అనసూయ అంటుంది. దీంతో అటు అనసూయ, ఇటు రోజాల మధ్య పరిస్థితి హీటెక్కుతుంది. ఆ తర్వాత అనసూయ ఓ కార్డ్ తెచ్చి రోజాకి ఇస్తూ.. రేపు మా ఇంట్లో బారసాల, మీరు తప్పకుండా రావాలి అని అంటుంది. ఎవరికీ అని అడగ్గా నాకే అంది అనసూయ. దాంతో రోజాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వెంట‌నే రేపు అయితే నాకు కుదరదు, నా పుట్టెంటికలు తీయాల్సి ఉంటుంది అని చెప్పి షాకిచ్చింది. అనంత‌రం ఎవరికి వయసు ఎక్కువుందో అందరూ చెబుతారు, మీరు ఒకసారి అటు చూడండి అంటూ సూర్యకాంతంతో దిగిన పాత ఫొటోని అన‌సూయ చూపిస్తుంది. దాంతో ఉలిక్కిప‌డ్డ రోజా.. గాంధీతో ఉన్న అన‌సూయ పిక్ చూపిస్తుంది. దీంతో సుధీర్‌ కల్పించుకుని `అనసూయగారు నాకు తెలియదు గానీ మీరు ఫ్రీడమ్‌ ఫైటర్` అని అనడంతో న‌వ్వులు పూస్తాయి. అత్తా వర్సెస్‌ కోడలు అనే కాన్సెప్ట్‌లో భాగంగా అనసూయ, రోజా ఇలా అత్తా కోడలిగా కామెడీ స్కిట్‌ ప్రదర్శించి న‌వ్వించారు. అయితే ఈ ఫుల్ కామెడీ స్కిట్ శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది. “అత్తా వర్సెస్ కోడలు” అనే కాన్సెప్ట్‌లో అనసూయ, రోజాల‌ ఫన్నీ ట్రోల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే అవకాశముంది.

editor

Related Articles