సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌లలో శృతిహాసన్ ఒకరు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఆమె అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉంటుంది. తరచుగా చిట్‌చాట్‌లు నిర్వహిస్తూ కెరీర్‌తో పాటు ఎన్నో పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ హీరోయిన్ కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగాను, ప్రశాంతంగాను ఉండాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది. ఆర్టిస్టు శంతను హజారికాతో బ్రేకప్ చేసుకున్న తర్వాత శృతిహాసన్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌పై దృష్టి పెట్టింది.
- July 9, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor

