మీరు పెట్టిన లడ్డూలను మర్చిపోను..

మీరు పెట్టిన లడ్డూలను మర్చిపోను..

వరుస విజయాలతో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు రష్మిక మందన్నా. రీసెంట్‌గా ఆమె హీరోయిన్‌గా నటించిన ‘కుబేర’ సినిమా  భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో తెగ సంబరపడిపోతోంది రష్మిక. ఈ సందర్భంగా తన కోస్టార్‌ ధనుష్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ‘మనం కలిసి ఓ భారీ సినిమాకు పనిచేసినప్పటికీ మనిద్దరికీ ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది. మనం మాట్లాడుకుంది చాలా తక్కువ. అది కూడా మనిషికి విశ్రాంతి ఎంత ముఖ్యమో చర్చించుకునేవాళ్లం. కానీ విశ్రాంతి మాత్రం తీసుకోలేదు. నటనాపరంగానే కాదు, వ్యక్తిగా కూడా మీరు ఎంతోమందికి ఆదర్శం. తమిళ డైలాగుల్లో మీరు చేసిన సాయం.. నా నటన నచ్చిన ప్రతిసారీ మీరిచ్చిన ప్రశంసలు ఇవన్నీ వినడానికి చిన్న విషయాలే అయినా.. నాకు మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. ముఖ్యంగా మీరు నాకోసం లొకేషన్‌కి తెచ్చిన లడ్డూలను తిని మర్చిపోలేకుండా ఉన్నాను.

editor

Related Articles