దిల్ రాజు భార్య‌లో టాలెంట్‌ను చూసి.. ఒక్క‌సారి షాక్..!

దిల్ రాజు భార్య‌లో టాలెంట్‌ను చూసి.. ఒక్క‌సారి షాక్..!

నిర్మాత దిల్ రాజు త‌న‌ మొద‌టి భార్య అనిత అనారోగ్యంతో చ‌నిపోవ‌డంతో తేజ‌స్విని అనే యువ‌తిని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. అసలు పేరు వైఘారెడ్డి కాగా, ఇద్దరి జాతకాలను బట్టి పేరును మార్చారని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. మొదటి భార్య అనిత మరణాంతరం ఆయన ఒంటరిగా ఉంటున్న నేప‌థ్యంలో అత‌నికి తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయ‌గా, ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంప‌తుల‌కి ఓ బుడ‌త‌డు కూడా ఉన్నాడు. అయితే తేజ‌స్విని సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడు పోస్టులు షేర్  చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఎక్కువగా భర్త దిల్ రాజు, తనయుడు అన్వి రెడ్డితో కలిసి దిగిన ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేసేది. కానీ ఇటీవ‌లి కాలంలో ఆవిడ పర్సనల్ ఫొటోలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అలాగే భర్తతో కలిసి ఫారిన్ వెకేషన్ వెళ్ళినప్పుడు సైతం అక్కడ తీసుకున్న ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తోంది. గతేడాది ఇంత ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని తేజ‌స్విని ఈ మధ్య మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. శనివారం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా దేశమంతా ఘనంగా యోగా డే సెలబ్రేట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అనేకమంది సెలబ్రిటీలు యోగాసనాలు వేసి ఆ ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో దిల్‌రాజు భార్య తేజస్విని కూడా యోగా డే సందర్భంగా ప్ర‌త్యేక‌మైన వీడియో షేర్ చేసింది. ఇందులో ప‌లుర‌కాల యోగాస‌నాలు వేస్తూ వాటికి సంబంధించిన పేర్ల‌ని కూడా పొందుప‌రిచింది. ఇది చూసిన వారు దిల్‌రాజు భార్య‌లో ఇంత టాలెంట్ ఉందా అని నోరెళ్ల‌బెడుతున్నారు. ప్ర‌స్తుతం అయితే దిల్‌రాజు భార్య తేజ‌స్విని వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

editor

Related Articles