సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తెలుసుకదా’. స్టైలిష్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టామని చిత్రబృందం పేర్కొంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అలరిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి కెమెరా: జ్ఞానశేఖర్ బాబా, సంగీతం: తమన్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతిప్రసాద్.
- June 19, 2025
0
46
Less than a minute
Tags:
You can share this post!
editor

