‘రివాల్వర్‌ రీటా’ సినిమాలో రాబోతోంది..

‘రివాల్వర్‌ రీటా’ సినిమాలో రాబోతోంది..

పెళ్లైన తర్వాత సినిమాల్ని బాగా తగ్గించింది హీరోయిన్ కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్ ‘రివాల్వర్‌ రీటా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్‌ 27న ‘రివాల్వర్‌ రీటా’ సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాని కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సందర్భంగా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. దీనిని కీర్తి సురేష్‌ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో కీర్తి సురేష్‌ చేసిన పోరాటాలు, పండించిన కామెడీ హైలెట్‌గా నిలిచాయి. తన కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన సినిమా అని, ఇందులో తొలిసారి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేశానని కీర్తి సురేష్‌ చెప్పింది.

editor

Related Articles