అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌లో 243 కి పైగా కన్నుమూయడం చాలామందిని బాధించింది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్ బిల్డింగ్‌ని ఢీకొట్టడంతో ఫ్లైట్‌లో ఉన్నవాళ్లతో పాటు బిల్డింగ్‌లో ఉన్న మెడికోస్ కూడా కన్నుమూసారు. అయితే ఈ విషాద ఘటనపై దేశ, విదేశాలకి చెందిన ఎందరో ప్రముఖులు స్పందిస్తూ వారికి నివాళులు అర్పించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసిందని తెలియజేస్తూ.. చాలా ఏళ్ల క్రితం సోదరుడు చిరంజీవి, ఆయన కూతురు సుస్మిత ఓ విమాన ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాగబాబు తన ఎక్స్‌లో .. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసింది. చాలా సంవత్సరాల క్రితం ఎంతోమంది ఫిల్మీ పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతిలో ఎక్కడో ల్యాండ్ అయ్యింది. అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య చిరంజీవి, మా స్వీటీ (సుష్మిత) పాపా ఉన్నారు. ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందంట మా అన్నయ్య మా స్వీటీ పాపా ఎలా ఉన్నారో సేఫ్‌గా వున్నారో లేదో అన్న ఆందోళన నా మనస్సును కలచివేసింది. అన్నయ్య, స్వీటీ పాపా సేఫ్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు సేఫ్ అని తెలిసాక మనసు కుదుట పడింది. ఆ ఫ్లైట్ ప్రమాదం ఎఫెక్ట్ ఈ రోజుకి నా మనసు లోంచి పోలేదు. అలాంటిది అహ్మదాబాద్‌లో జరిగిన ఫ్లైట్ క్రాష్ గురించి విజువల్స్ చూస్తుంటే నా గుండె తరుక్కు పోయింది. చనిపోయిన వాళ్ళకి కన్నీళ్ళతో బాధాతప్త హృదయంతో, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని నాగబాబు ట్వీట్ చేశారు.
- June 13, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor

