సీనియర్‌ నిర్మాత మహేంద్ర మృతి!

సీనియర్‌ నిర్మాత మహేంద్ర మృతి!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్ననే దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ కన్ను మూసిన వార్త మరువక ముందే మరో నిర్మాత కన్ను మూశారన్న వార్త ఇప్పుడు బయటకి వచ్చింది. 1977లో ‘ప్రేమించి పెళ్ళి చేసుకో’, ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురలేని మొనగాడు’, ‘ఢాకూరాణి’,  ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్మ్యం’ తదితర చిత్రాలు నిర్మించిన నిర్మాత మహేంద్ర ఇక లేరు. 1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలుకా దోసపాడులో జన్మించిన కావూరి మహేంద్ర, దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది నిర్మాతగా మారిన మహేంద్ర కె. ప్రత్యగాత్మ, కె. హేమాంబరధరరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. అలాగే ప్రొడక్షన్‌ కంట్రోలర్ గానూ పలు సినిమాలకు పనిచేశారు. ఇంకా రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ చిత్ర నిర్మాణం శ్రీహరితోనే ‘దేవా’ సినిమాలు నిర్మాణం వహించారు. అయితే గత కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరులో తుదిశ్వాస విడిచారు. గుంటూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మరి వీరి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ఓం శాంతి.

editor

Related Articles