చిరంజీవి వింటేజ్‌ కామెడీ టైమింగ్‌ను మరోసారి చూస్తారు..

చిరంజీవి వింటేజ్‌ కామెడీ టైమింగ్‌ను మరోసారి చూస్తారు..

చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా తాజా షెడ్యూల్‌ బుధవారం ముస్సోరీలో మొదలైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నయనతార హీరోయిన్. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తయింది. బ్యూటీఫుల్‌ హిల్‌ స్టేషన్‌ ముస్సోరీలో మొదలైన తాజా షెడ్యూల్‌ పదిరోజుల పాటు జరుగుతుందని.. చిరంజీవి, నయనతారతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారని, కొన్ని కీలకమైన వినోదాత్మక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. నాన్‌స్టాప్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి వింటేజ్‌ కామెడీ టైమింగ్‌ను మరోసారి చూస్తారని, అభిమానులకు నవ్వుల విందులా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

editor

Related Articles