నిఖిల్ సినిమా షూటింగ్‌లో భారీ ప్ర‌మాదం..

నిఖిల్ సినిమా షూటింగ్‌లో భారీ ప్ర‌మాదం..

టాలీవుడ్ హీరో నిఖిల్ న‌టించిన కొన్ని సినిమాలు నార్త్ ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంత‌గానో అల‌రించాయి. ప్ర‌స్తుతం నిఖిల్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ రేంజ్ ఏ లెవ‌ల్‌కి వెళ్లిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే తాజాగా నిఖిల్ ది ఇండియన్ హౌస్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో వేసిన సెట్లో జరుగుతోంది. అయితే అనుకోకుండా ఊహించ‌ని ప్ర‌మాదం సంభ‌వించింది. సినిమాలోని సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం నీట మునిగింది. ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలు కాగా, ఇంకా మరికొంత మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్ర‌స్తుతం సెట్‌లో నెల‌కొన్న గంద‌ర‌గోళానికి సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఆ స‌మ‌యంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ సెట్‌లో ఉన్నారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఈ ఘటనతో సెటప్ మొత్తం ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. తీవ్ర ఆర్థిక నష్టం కూడా సంభవించినట్లు టాక్ వినిపిస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలానే పరిస్థితిని సమీక్షించిన యూనిట్ ప్రస్తుతం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు స‌మాచారం.

editor

Related Articles