బ‌న్నీతో కాదు ఎన్టీఆర్‌తోనే.. త్రివిక్ర‌మ్ సినిమాపై స‌స్పెన్స్

బ‌న్నీతో కాదు ఎన్టీఆర్‌తోనే.. త్రివిక్ర‌మ్ సినిమాపై స‌స్పెన్స్

త్రివిక్ర‌మ్ త‌న త‌దుప‌రి సినిమాను బ‌న్నీతో చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కాని బ‌న్నీ కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో క‌లిసి క్రేజీ సినిమా చేస్తున్నాడు. దీంతో త్రివిక్ర‌మ్ త‌న త‌దుప‌రి సినిమాని ఎవ‌రితో చేస్తాడ‌నే  చర్చ మొద‌లైంది. ఆ మ‌ధ్య విక్టరీ వెంక‌టేష్‌తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఆ త‌ర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప్రస్తుతం రామ్‌చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేయ‌నున్నాడ‌ని అన్నారు. క‌ట్ చేస్తే ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఖాతాలో ఎన్టీఆర్ కూడా చేరాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన మైథలాజికల్ సినిమాని ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఆ లోపు త్రివిక్ర‌మ్.. వెంకీ, రామ్ చరణ్‌లతో సినిమాలు చేసి ఆ తర్వాతే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులు లైనప్‌లో పెడుతున్నారు త్రివిక్రమ్. మైథ‌లాజికల్ సినిమాకి సంబంధించిన స్టోరీని ఇప్ప‌టికే ఎన్టీఆర్‌కి వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.

editor

Related Articles