షూటింగ్‌ స్టార్ట్ చేసిన ‘సూర్య 46’

షూటింగ్‌ స్టార్ట్ చేసిన ‘సూర్య 46’

త‌మిళ హీరో సూర్య త‌న కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. రెట్రో సినిమాతో ఇటీవ‌ల ప్రేక్ష‌కులను అల‌రించిన సూర్య త‌న త‌దుప‌రి సినిమా వెంకీ అట్లూరితో చేస్తున్న విష‌యం తెలిసిందే. ‘సూర్య 46 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లే ప‌ళ‌ని మురుగ‌న్‌ని ద‌ర్శించుకున్న ఈ చిత్ర‌బృందం తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను షేర్ చేసింది. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాకుండా, రవీనా టాండన్, రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles