సింగ‌ర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం..

సింగ‌ర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం..

ప్రముఖ టాలీవుడ్ సింగ‌ర్‌ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాలకు దారి తీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ బర్త్‌డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా.. ఈ దాడుల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు మంగ‌ళ‌వారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే  పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు.

editor

Related Articles