అఖండ‌ 2 టీజ‌ర్ గురించి అభిమానితో బాల‌య్య డిస్క‌ష‌న్..

అఖండ‌ 2 టీజ‌ర్ గురించి అభిమానితో బాల‌య్య డిస్క‌ష‌న్..

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీక్వెల్‌గా ‘ అఖండ 2 తాండవం’ రూపొందుతోంది. దసరా కానుకగా ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా విడుద‌లైన టీజ‌ర్‌లో.. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా” అంటూ బాలయ్య చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేసింది. బోయపాటి మార్క్ టేకింగ్, బాలయ్య యాక్షన్, అద్భుతమైన విజువల్స్, బీజీఎమ్‌తో అఖండ 2 టీజ‌ర్ రికార్డులు తిర‌గరాస్తుంది. కేవలం 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాకుండా 590k లైక్స్ కూడా వచ్చాయి. ఈ క్ర‌మంలో బాలకృష్ణ మరో అరుదైన రికార్డు సాధించారు. మొత్తానికి టీజ‌ర్‌కి  ఓ రేంజ్‌లో స్పంద‌న వ‌స్తుండ‌డంతో బాల‌య్య కూడా హ్యాపీగా ఉన్నారు. నా అభిమానులు ఒక్కరే కాదు ప్రేక్షకులు అందరికీ ‘అఖండ 2’ టీజర్ నచ్చిందని బాలకృష్ణ తెలిపారు. నాకు బయట వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇప్పటికి పదిసార్లు టీజర్ చూశామని అన్నారు. ప్రేక్షక దేవుళ్ల ఫోన్లతో నాకు చాలా ఆనందం అనిపించింది.

editor

Related Articles