బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తన తండ్రి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణె 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తన తండ్రి బర్త్‌డే కానుకగా.. ‘పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్’ (PSB) పేరుతో ఒక బ్యాడ్మింటన్ పాఠశాలను ఆమె ప్రారంభించింది. ఈ కొత్త పాఠశాల తొలి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 75 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నగరాల్లో బెంగళూరు, NCR, ముంబై, చెన్నై, జైపూర్, పుణె, నాసిక్, మైసూరు, పానిపట్, డెహ్రాడూన్, ఉదయ్‌పూర్, కోయంబత్తూర్, సాంగ్లీ, సూరత్ వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా దీపికా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేసింది. ఒక బ్యాడ్మింటన్ ఆటను ఆడుతూ పెరిగిన వ్యక్తిగా, ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఎంతగా తీర్చిదిద్దుతుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ‘పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్’ (PSB) ద్వారా, మేము అన్నివర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆనందాన్ని, క్రమశిక్షణను అందించాలని ఆశిస్తున్నాము. అలాగే, ఆరోగ్యకరమైన, మరింత దృష్టి కేంద్రీకరించిన, క్రీడల ద్వారా స్ఫూర్తి పొందిన తరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాము.
- June 10, 2025
0
131
Less than a minute
Tags:
You can share this post!
editor

