బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ మరోసారి సౌత్ దర్శకుడితో చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుకుమార్‌తో కలిసి షారుఖ్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు చాలారోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ కాంబో మళ్లీ తెరపైకి రాగా.. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 నుండి రూ.300 కోట్లు ఉండబోతుందని సమాచారం. అలాగే ఈ సినిమాకు షారుఖ్‌తో పాటు సుకుమార్‌కు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ మెగా ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన ‘కింగ్’, ‘పఠాన్ 2’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. సుకుమార్ కూడా ప్రస్తుతం తన తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
- June 10, 2025
0
115
Less than a minute
Tags:
You can share this post!
editor

