వి.ఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో థ్రిల్లర్‌ సినిమా ‘ఫణి’

వి.ఎన్‌  ఆదిత్య  డైరెక్షన్‌లో  థ్రిల్లర్‌  సినిమా  ‘ఫణి’

దర్శకుడు వి.ఎన్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌ సినిమా ‘ఫణి’. మీనాక్షి అనిపిండి ఈ సినిమాని ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఒక నల్ల పాము ప్రధాన పాత్రగా రూపొందుతోన్న ఈ సినిమాలో కేథరిన్‌ ట్రెసా, మహేష్ శ్రీరామ్‌, నేహాకృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్‌ కీలక పాత్రధారులు. ఆదివారం చిత్ర నిర్మాత మీనాక్షి అనిపిండి పుట్టినరోజు సందర్భంగా, శుభాకాంక్షలు చెబుతూ సినిమా అప్‌డేట్‌ని మేకర్స్‌ తెలిపారు. జూన్‌లో సినిమాని విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు. నిర్మాత మీనాక్షి అనిపిండి ఈ సినిమాకి సంగీతం కూడా అందించడం విశేషం. ఆమె సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని వీఎన్‌ ఆదిత్య తెలిపారు. ఈ సినిమాకి రచన: పద్మావతి మల్లాది, కెమెరా: బుజ్జి.కె, సాయికిరణ్‌ అయినంపూడి.

editor

Related Articles