చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన టాలెంట్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలలో రామ్ చరణ్ నటన చూసి పరవశించని వారు లేరు. ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాతో చెర్రీ మరోసారి తన టాలెంట్ ప్రదర్శించడం ఖాయం అంటున్నారు. అయితే గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు బొమ్మ విగ్రహం లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9న ఆవిష్కరించనున్నారు. రామ్‌చరణ్‌కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ అంతా లండన్‌లోనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్ కారా లండన్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు బొమ్మ విగ్రహాలని లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారన్న విషయం మనందరికి తెలిసిందే. మే 11న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR సినిమాని ప్రదర్శించనున్నారు.
- May 6, 2025
0
327
Less than a minute
Tags:
You can share this post!
administrator

