Movie Muzz

స‌మంత బ‌ర్త్ డే స్పెషల్.. ఆమె గుడిలో పేదలకు అన్న‌దానం, సేవా కార్య‌క్ర‌మాలు

స‌మంత బ‌ర్త్ డే స్పెషల్.. ఆమె గుడిలో పేదలకు అన్న‌దానం, సేవా కార్య‌క్ర‌మాలు

స‌మంత ఇప్పుడు తెలుగు హీరోయిన్‌గా మారి నాగ చైత‌న్య‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత అంద‌రూ ఆమెని తెలుగు అమ్మాయిగానే భావిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన స‌మంత‌ తన కంటూ ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్ క్రియేట్ చేసుకొని సోలో హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందిస్తోంది. అలానే ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈమెకు ఓ అభిమాని గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకొన్నాడు. సమంతను దేవతగా భావించి కొలుస్తున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్‌ హీరోయిన్ సమంతకు వీరాభిమాని కాగా, ఆమె న‌ట‌నతో పాటు చేసే సేవా కార్య‌క్ర‌మాల‌కి ఎంతో ఆకర్షితుడ‌య్యాడు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంతో సందీప్ ఆమెకి గుడి క‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 2023 ఏప్రిల్ 28న తెనాలి సందీప్ గుడిని ప్రారంభించాడు. స‌మంత బ‌ర్త్ డే (ఏప్రిల్ 28) సంద‌ర్భంగా ఇప్పుడు ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండపం ఏర్పాటు చేసి అందంగా అలకరించి ఆ మండపంలో రెండు రకాల సమంత విగ్రహాలను నెలకొల్పి తన అభిమానాన్ని చాటుకొన్నాడు సందీప్. ఇక ఆ గుడికి టెంపుల్ ఆఫ్ సమంత అని పేరు పెట్టాడు. స‌మంత బ‌ర్త్ డే సంద‌ర్భంగా అన్న‌దానం, సేవా కార్య‌క్ర‌మాలు నిర్వహించాడు.

administrator

Related Articles