కొత్త సినిమా కోసం స్లిమ్‌గా తయారైన ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండుగే

కొత్త సినిమా కోసం స్లిమ్‌గా తయారైన ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండుగే

హీరో ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులు అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత వ‌చ్చిన దేవ‌ర సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దేవ‌ర త‌ర్వాత ఎన్టీఆర్ ఏ హీరోతో సినిమా చేయ‌నున్నాడు, షూటింగ్ ఎప్పుడు మొద‌లు పెడ‌తాడు, ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే అనుమానాలు అంద‌రిలో ఉన్నాయి. ఇప్పుడు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు యంగ్ టైగర్ ఏప్రిల్ 22 నుండి క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నున్న‌ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఎన్టీఆర్ హైద‌రాబాద్‌ను వ‌దిలి క‌ర్ణాట‌క‌కు వెళ్లాడు. క‌ర్ణాట‌క వెళ్తూ ఎయిర్‌పోర్టులో త‌న నిర్మాత‌ల‌తో మాట్లాడుతూ క‌నిపించాడు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్‌ని త‌మ కెమెరాల‌లో బంధించారు. ఎన్టీఆర్ లుక్ అయితే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత స‌న్న‌గా , స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. జాకెట్ లాంటి ష‌ర్ట్, క‌ళ్ల‌కు అద్దాలు పెట్టుకుని త‌న లుక్‌తో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్.

editor

Related Articles