ఏడాది తర్వాత ఫ్యామిలీ పిక్‌ షేర్‌ చేసిన ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌

ఏడాది తర్వాత ఫ్యామిలీ పిక్‌ షేర్‌ చేసిన ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌

బాలీవుడ్‌ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్‌‌, అభిషేక్‌ బచ్చన్‌  విడాకులు తీసుకోబోతున్నారంటూ  గత కొంత కాలంగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. కానీ, ఇద్దరూ కలిసి పలు ఈవెంట్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నారు. తాజాగా విడాకుల వార్తలకు ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ చెక్‌ పెట్టారు. తమ 18వ వివాహ వార్షికోత్సవం  సందర్భంగా భర్త అభిషేక్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఉన్న ఫొటోను ఐశ్వర్య షేర్‌ చేశారు. దీనికి వైట్‌ హార్ట్‌ ఎమోజిని జతచేశారు. దాదాపు ఏడాది తర్వాత ఆమె తన భర్తతో ఉన్న ఫొటోను షేర్‌ చేయడం ఇదే తొలిసారి. తాజా పోస్ట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లైంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు, అభిమానులు ఐశ్వర్య – అభిషేక్‌ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

editor

Related Articles