తమిళ హీరో అజిత్‌కు మరోసారి కార్ యాక్సిడెంట్ అయ్యింది. బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో ఆయన పాల్గొన్నారు. రేస్ సమయంలో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఆయన నడిపిన కారు ట్రాక్ నుండి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇంతకుముందు కూడా అజిత్ రెండుసార్లు కారు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు కూడా అజిత్‌కు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- April 19, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor