వచ్చే 3 సినిమాల‌పైనే భారీ అంచ‌నాలు.. ఇవి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయా..!

వచ్చే 3 సినిమాల‌పైనే భారీ అంచ‌నాలు.. ఇవి  బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయా..!

త్వరలో రానున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాలు డ్రాగ‌న్‌, స్పిరిట్‌, పెద్ది చిత్రాలు ఇండియ‌న్ బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డానికి రెడీ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలు దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన‌వి కాగా, ఈ సినిమాల కోసం తొలిసారి స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్ట‌ర్లు క‌లిసి ప‌నిచేస్తున్నారు. పెద్ది సినిమా విష‌యానికి వ‌స్తే ఉప్పెన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు.. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా పెద్ది అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది ఎంత పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాని వ‌చ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌రొక సినిమా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెర‌కెక్కించ‌నున్న హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా స్పిరిట్. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 2027లో దీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. యానిమ‌ల్‌ త‌రువాత సందీప్ రెడ్డి వంగ నుండి వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డంతో అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక గ‌త కొన్నేళ్లుగా వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఈసారి ప్ర‌శాంత్ నీల్‌తో పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా డ్రాగ‌న్‌ అనే సినిమా చేయ‌బోతున్నాడు.. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభం కాగా, ఈ నెల 22 నుండి ఎన్టీఆర్ సెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న ఈ సినిమాని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

editor

Related Articles