ఉత్తరాఖండ్‌లో ఊర్వశీ రౌతేలా పేరుతో టెంపుల్..

ఉత్తరాఖండ్‌లో ఊర్వశీ రౌతేలా పేరుతో టెంపుల్..

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఆమె ఫ్యాన్స్ ఉత్తరాఖండ్‌లో త‌న‌కి గుడి క‌ట్టార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి తన వ్యాఖ్య‌ల‌తో ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో నవ్వులపాలైన ఈ నటి, ఇప్పుడు నమ్మశక్యం కాని మరో వాదనను తెరపైకి తెచ్చింది. సన్నీడియోల్, రణదీప్ హుడా నటించిన ‘జాట్’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి, తాజాగా తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఒక గుడి ఉందని, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా తన పేరుతో ఒక గుడిని నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. మీరు బద్రీనాథ్ టెంపుల్‌కి వెళ్లినప్పుడు, సరిగ్గా దాని పక్కనే అది మీకు క‌నిపిస్తుంది. ప్రజలు ఆ గుడిలో ప్రార్థనలు చేస్తారని, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తనను ప్రార్థిస్తారని అలాగే తన ఫొటోలకు పూలమాలలు వేసి ‘దండమమాయి’ అని కొలుస్తార‌ని ఊర్వశి చెప్పింది.

editor

Related Articles