విజయవాడలో కీర్తి సురేష్‌చే షాప్ ఓపెనింగ్..

విజయవాడలో కీర్తి సురేష్‌చే  షాప్ ఓపెనింగ్..

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో టాలీవుడ్‌ హీరోయిన్, మహానటి కీర్తి సురేష్ సందడి చేశారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు  వచ్చారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నటితో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ‘నేను శైలజా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించింది కీర్తి సురేష్. ఆ తర్వాత ‘మ‌హాన‌టి’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవతరించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కీర్తి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్‌ అక్క. బాలీవుడ్ న‌టి రాధికా ఆప్టే ఇందులో కీల‌క పాత్రలో న‌టించ‌బోతోంది. య‌ష్ రాజ్ ఫిలిమ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌ను వ‌దిలింది. ఈ టీజ‌ర్ చూస్తుంటే.. కీర్తి ఇందులో లేడి డాన్ అక్కగా క‌నిపించ‌బోతోంది. పెర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంద‌ని అనే స్టోరీలైన్‌తో ఈ సినిమా రాబోతోంది.

editor

Related Articles