హీరో చిరంజీవి రీసెంట్‌గా కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కాగా.. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మే మూడో వారం నుండి చిరంజీవి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవికి జోడీగా ఇద్దరూ హీరోయిన్లు నటించబోతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు టాక్. భీమ్స్ సంగీతం అందించబోతున్నాడు.

- April 18, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor