ఇటీవల అనురాగ్ ముంబై నుండి తన మకాంను బెంగళూరుకి మార్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో క్రియేటివిటి లేదని.. అక్కడ విసుగుపుట్టి సౌత్ ఇండస్ట్రీకి వచ్చానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో అనురాగ్ కశ్యప్ సినిమాలు మానేస్తున్నారనే పుకార్లు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చాడు అనురాగ్. నేను సినిమాలు వదిలేశాను అనుకున్న వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం. నేను నగరాలు మారాను కానీ సినిమాలు తీయడం మానలేదు. నేను నిరాశ చెంది వెళ్లిపోయానని అనుకునే వారందరికీ – నేను ఇక్కడే ఉన్నాను, షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను (అలా ఉండాలి, నేను అతనంత డబ్బు సంపాదించ లేకపోవచ్చు) కానీ, 2028 వరకు నా డేట్స్ ఖాళీలేవు. ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాను, ఇప్పుడు మూడు, రెండు వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావచ్చు.

- April 18, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor