ఓ సినిమా సెట్లో హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సదరు నటుడిపై చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు చేసింది. ‘సూత్రవాక్యం’ సినిమా సెట్లో నటుడు షైన్ టామ్ చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ మేరకు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ , మలయాళ చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు చేసింది. కాగా, 2019 లో విన్సీ సోనీ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘రేఖ’ అనే సినిమాతో కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆమె నటించిన ‘జనగణన’ సినిమా అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. అయితే ఓ సినిమా సెట్లో హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె బుధవారం సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకొని వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ తాను ఎన్నో ఇబ్బందులు అనుభవించినట్టు తెలిపింది. ఓ సారి అయితే తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బందిపెట్టాడని కూడా తెలియజేసింది.

- April 17, 2025
0
92
Less than a minute
Tags:
You can share this post!
editor