తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత, సినీ హీరో విజయ్‌పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఈ ఫత్వాను జారీ చేశారు. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతని నేపథ్యం.. అతడి గత చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని ఫత్వాలో పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు మద్యం తాగే వారిని, జూదగాళ్లను ఆహ్వానించడం నేరమే కాకుండా పాపమని పేర్కొన్న బోర్డు.. ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మతపరమైన కార్యకలాపాలకు అటువంటి వారిని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలను కోరింది. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దని, అలాగే వారి మతపరమైన కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించవద్దని రజ్వీ విజ్ఞప్తి చేశారు.

- April 17, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor