‘ఇంద్రగంటి మోహనకృష్ణతో పనిచేయాలనే కోరిక ఇన్నాళ్లకు ఈ సినిమాతో తీరింది. మండు వేసవిలో చల్లని వినోదాల జల్లులా అనిపించే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హాయిగా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది’ అని అన్నారు ప్రియదర్శి. ఆయన హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. రూపా కొడవాయూర్ హీరోయిన్. బుధవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. క్రైమ్ కామెడీ కథాంశంతో ఆద్యంతం చక్కటి హాస్యంతో ఈ సినిమా తీశామని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. ఈ సినిమా ఔట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నామని, హిట్ గ్యారంటీ అని నమ్ముతున్నామని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. స్వతహాగా తాను జాతకాలు నమ్మనని, కానీ ఈ సినిమాలో నటించిన తర్వాత నమ్మకం వచ్చిందని హీరోయిన్ రూపా కొడవాయూర్ తెలిపింది. పుష్పక విమానం సినిమా టాకీగా తీస్తే ఎలా ఉంటుందో ‘సారంగపాణి జాతకం’ అలా ఉంటుందని వెన్నెల కిషోర్ అన్నారు.

- April 17, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor