2209లో ఏం జరుగుతుందో ముందుగా ఊహించిన కథ

2209లో ఏం జరుగుతుందో ముందుగా ఊహించిన కథ

కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ ‘2209’ పేరుతో ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకి శ్రీకారం చుట్టారు. 2209లో జరిగే కథ ఇది. అనుప్‌ భండారి దర్శకుడు. ‘హనుమాన్‌’ చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించనున్నారు. బుధవారం ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. భారతీయ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కథల పరంపరలో ఇదొక వినూత్నమైన ప్రయోగమని, ఓ సాహస యాత్రను ఆవిష్కరిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుందని, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.

editor

Related Articles