ఫాలోయర్స్‌ ఉంటే ఏం లాభం? డబ్బులు పెట్టి సినిమా చూసేవాళ్లుండాలి కదా..

ఫాలోయర్స్‌ ఉంటే ఏం లాభం? డబ్బులు పెట్టి సినిమా చూసేవాళ్లుండాలి కదా..

హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం ‘రెట్రో’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది. సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియా గురించి పూజాహెగ్డే ఆసక్తికరమైన కామెంట్స్‌ చేసింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 కోట్ల మంది ఫాలోయర్స్‌ ఉన్నారని, అంతమాత్రాన వారందరూ టికెట్లు కొని సినిమాలు చూస్తారని గ్యారంటీ ఇవ్వలేం కదా అని వ్యాఖ్యానించింది. ‘సోషల్‌ మీడియా చాలా భిన్నమైన ప్రపంచం. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు. కొంతమంది తారలకు 50 లక్షల మంది ఫాలోయర్స్‌ మాత్రమే ఉంటారు. కానీ బాక్సాఫీస్‌ వద్ద వాళ్ల సినిమాలకు మంచి కలెక్షన్లు ఉంటాయి. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘రెట్రో’ సినిమాని తెరకెక్కించారు. ఇందులో సూర్య గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తారని సమాచారం.

editor

Related Articles