‘కోర్ట్‌’ సినిమా తప్పక చూడండి: నాని

‘కోర్ట్‌’ సినిమా తప్పక చూడండి: నాని

హీరో నాని నిర్మాణంలో వ‌స్తున్న తాజా సినిమా ‘కోర్ట్‌: స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’. ఈ సినిమాకు రామ్‌ జగదీశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా న‌టిస్తున్నారు. ప్రియ‌ద‌ర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న‌ ఈ సినిమా మార్చి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా ట్రైల‌ర్‌తో పాటు ప్రీ రిలీజ్ వేడుకను చిత్రబృందం నిర్వ‌హించింది. ఇక ఈ వేడుకకు నానితో పాటు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ, శ్రీకాంత్ ఓదెలా, మోహనకృష్ణ ఇంద్రగంటి, నాగ్‌ అశ్విన్ త‌దిత‌రులు వ‌చ్చి చిత్రబృందానికి విషెస్ తెలిపారు. అయితే ఈ వేడుక‌లో నాని మాట్లాడుతూ.. 14వ తేదీ కోర్ట్‌ సినిమా రాబోతోంది. ఈ సినిమా మీరు మిస్ కావద్ద‌ని నేను కోరుకుంటున్నాను. నా 16 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు ఒక వేదిక‌పైకి వ‌చ్చి ద‌యచేసి సినిమాకి వెళ్లండ‌ని అడుగ‌లేదు. కానీ, ఈ చిత్ర విషయంలో ఆ మాట అడుగుతున్నా. ఎందుకంటే ఈ సినిమాను మీరు మిస్ అవ్వ‌కుడ‌దు. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో మీకు న‌చ్చిన వారితో సినిమాకి వెళ్లండి.

editor

Related Articles