హిందీ హీరో మరోసారి విలన్‌‌గా నటించనున్నారు?

హిందీ హీరో మరోసారి విలన్‌‌గా నటించనున్నారు?

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో విలన్‌గా నటించిన ఆయన ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’లో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ‘అఖండ-2’ సినిమాలో కూడా సంజయ్‌దత్‌ విలన్‌గా నటించే అవకాశముందని ఫిల్మ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలావుండగా ఆయన మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పారని, అందులో కూడా విలన్‌గానే కనిపించనున్నారని సమాచారం. సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కేపీ రోహిత్‌ దర్శకుడు. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో విలన్‌గా సంజయ్‌దత్‌ నటించనున్నారని వార్తలొస్తున్నాయి.

editor

Related Articles