హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘అఖండ 2’ (తాండవం). బ్లాక్ బస్టర్ సినిమా ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన సినిమా యూనిట్ అనంతరం జార్జియాలో కూడా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. అయితే తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక ఎపిసోడ్‌లను చిత్రీకరిస్తోంది చిత్రయూనిట్. అయితే ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణతో బోయపాటి ఒక మాస్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది డ్యాన్సర్లు ఈ సాంగ్‌లో బాలయ్యతో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు. భాను నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పకులు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.

- September 21, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor