60 + వెంక‌టేష్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌..!

60 + వెంక‌టేష్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌..!

విక్ట‌రీ వెంక‌టేష్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఆయ‌న చివ‌రి సినిమా సంక్రాంతికి వ‌స్తున్నాం  ఏకంగా 300 కోట్ల రూపాయలకి పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. వెంక‌టేష్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో వీరిద్దరూ సంచలన విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే త్రివిక్ర‌మ్ ఆ రెండు చిత్రాల‌కి ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తే తాజా సినిమాకి ద‌ర్శ‌కుడిగా వ‌ర్క్ చేయ‌నున్నారు. ఇక వెంకటేష్ – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే కొత్త సినిమాకి ‘వెంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమాకి డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. అబ్బాయిగారు 60+ అనే టైటిల్‌ని త్రివిక్ర‌మ్-వెంకీ సినిమాకి అనుకున్న‌ట్టు టాక్. మ‌రి దీనికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన వినోదభరితమైన చిత్రమవుతుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను ఫినిష్ చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాలు, హాస్యం మేళవించిన కథతో ఈ సినిమా ఉండబోతోందట. వెంక‌టేష్‌కి జోడీగా  త్రిషను సినిమాలో హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

editor

Related Articles