24 అశ్లీల చిత్రాలకు ఓటీటీలో నిషేధం..

24 అశ్లీల చిత్రాలకు ఓటీటీలో నిషేధం..

ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ కట్టడికి  కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై  కొరడా ఝుళిపించింది.  నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో అశ్లీల సినిమాలను ప్రసారం చేస్తోన్న మాధ్యమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 యాప్స్‌, వెబ్‌సైట్లను బ్యాన్‌ చేసినట్లు పేర్కొంది. వాటిలో ఉల్లు, ఎఎల్‌టీటీ, బిగ్‌ షాట్స్‌, దేశీఫ్లిక్స్‌, బూమెక్స్‌, నవరస లైట్‌, గులాబ్‌, కంగన్‌, బుల్‌, జాల్వా, Wow ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ ప్రైమ్‌, ఫెనియో, షోX , సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌X VIP, హల్‌చల్‌, మూడ్‌X, నియోX , ఫుంగీ, మోజ్‌ఫ్లిక్స్‌, ట్రిఫ్లిక్స్‌ ఉన్నాయి. ఆయా వెబ్‌సైట్లు ఎక్కడా కనిపించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను  కేంద్రం ఆదేశించింది.

editor

Related Articles