టాలీవుడ్‌లో ‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీగా మారింది. కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు, టీవీ సీరియల్స్ చేస్తూ వచ్చిన మృణాల్, ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీత పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హోమ్లీ లుక్‌తో పాటు గ్లామర్ యాంగిల్ కూడా చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మృణాల్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌లో ఒక క్రేజీ సీక్వెల్ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 2012లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్’ సినిమాకు సీక్వెల్ రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఆమె తెలుగులో అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది.
- March 11, 2026
0
4
Less than a minute
You can share this post!
editor


