నాగార్జున కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయే 100వ సినిమాపై కొత్త అప్‌డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని సినిమా లవర్స్‌తోపాటు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం నాగ్ వందో సినిమాకు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున. నాగ్ ఇటీవలే కూలీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారని ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు ఈ సినిమాని నాగార్జున 2026 మే నెలలో సమ్మర్ కానుకగా అభిమానుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో నాగ్ 100వ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలపై స్పష్టత రానుంది.

- September 24, 2025
0
134
Less than a minute
You can share this post!
editor